English | Telugu
సమంత ఛార్మిల ఐటెంసాంగ్..!
Updated : Oct 10, 2014
'ఐ' మూవీ తర్వాత విక్రమ్ నటిస్తున్న సినిమా 'పత్తుఎన్‌రాధుకుల్లా'. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా చేస్తోంది. లేటెస్ట్ కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందట. ఈ పాట కోసం పూణెలో రూ.2.5 కోట్లు వెచ్చించి మరీ ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ సాంగ్ దాదాపు 9 నిమిషాలపాటు కొనసాగుతుందట. ఈ పాటకోసం చార్మీని సంప్రదించగా.. కాన్సెప్ట్ తెగ నచ్చేయడం వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ స్పెషల్ సాంగ్ లో ఛార్మీ తో పాటు సమంత కూడా స్టెప్స్ వేయనుంది. అక్టోబర్ 20 తర్వాత ఈ పాటని చిత్రీకరిస్తారు. నవంబర్ కల్లా మూవీ షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.