English | Telugu

అదృష్ట‌మంటే ఆ ద‌ర్శ‌కుడిదే...

ఒక్క సినిమా, ఒక్క సినిమా... జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఓ హిట్టు ఎక్క‌డికో తీసుకెళ్లిపోతుందంటారు. ప్ర‌స్తుతం చందూ మొండేటి ప‌రిస్థితి ఇలానే ఉంది. కార్తికేయ సినిమాతో త‌న ప్ర‌స్థానం ప్రారంభించాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. విభిన్న‌మైన సినిమాలు తీసే స‌త్తా త‌న‌కు ఉంద‌ని నిరూపించుకొన్నాడు. ఈ సినిమాతో నిర్మాత‌కు లాభాలు తెచ్చిపెట్టాడు. క‌థానాయ‌కులు, నిర్మాత‌ల దృష్టి చందూపై ప‌డ‌డానికి ఇంత‌కంటే కార‌ణాలు కావాలా...?? నాగార్జున లాంటివాడే.. ''ఓ మంచి క‌థ చెప్పు, సినిమా చేద్దాం'' అనేశాడు. అంతేకాదు... రూ.50 ల‌క్ష‌ల అడ్వాన్స్ చేతికిచ్చాడ‌ట‌. గీతా ఆర్ట్స్ నుంచి కూడా చందూకి పిలుపొచ్చింది. ఇద్ద‌రు ముగ్గురు యువ హీరోలు చందూతో ట‌చ్‌లో వ‌చ్చారు. దాంతో మురిసిపోతున్నాడు చందూ. తొలి సినిమా కార్తికేయ‌కు చందూ పారితోషికం ఎంతో తెలుసా..?? ఆ సంస్థ‌కు ఆయ‌నో నెల జీత‌గాడు మాత్ర‌మే. నెల‌కు ఇంత అని పారితోషికం ఇచ్చారు. మ‌హా అయితే నాలుగైదు ల‌క్ష‌ల‌కు మించి ఉండ‌దు. ఇప్పుడు ఏకంగా అర‌కోటి అడ్వాన్సులుగా తీసుకొంటున్నాడు. హిటు మ‌హ‌త్యం అదే!!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.