English | Telugu
అఖిల్‌తోనే ఆడతానన్న అనుష్క
Updated : Nov 12, 2014
హుద్ హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చింది చిత్రసీమ. ఈనెల 30న వినోద కార్యక్రమాలు నిర్వహించి, వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని తుపాను బాధితులకు అందివ్వాలనుకొంటోంది. ఇందుకు సంబంధించి ఓ ప్రణాళికా సిద్ధం చేసింది. అందులో భాగంగా చిత్రసీమ క్రికెట్ మ్యాచ్ ఆడబోతోంది. నాలుగు టీమ్‌లు పోటీలో పాల్గొనబోతున్నాయి. నలుగురు హీరోలు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఒక్కొక్క జట్టులో ఇద్దరేసి కథానాయికలు కూడా ఉంటారు. ఓ టీమ్‌కి సిసింద్రీ అఖిల్ నాయకత్వం వహిస్తాడు. అఖిల్ మంచి ప్లేయర్. సీసీఎల్‌లో బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. అందుకే అఖిల్ జట్టులో ఉండడానికి కథానాయికలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అనుష్క అయితే ''నేను అఖిల్ జట్టులోనే ఉంటా.. తనతోనే ఆడతా'' అని ముందే కర్చీఫ్ వేసుకొందట. అనుష్క ఆడడానికి రెడీ అనడమే మగద్భాగ్యం. అందుకే నిర్వాహకులు కూడా అనుష్కని అఖిల్ టీమ్‌లో చేర్చారు. ఈనెల 30న ఈ క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకట్రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.