English | Telugu

చంద్రమోహన్‌ ఆరోగ్యంగానే వున్నారు

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌ హైదరాబాద్‌లోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని చంద్రమోహన్‌ మేనల్లుడు కృష్ణప్రసాద్‌ తెలిపాడు. ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌కు గురువారం మధ్యాహ్నం గుండెపోటు రావటంతో, బందువులు, సన్నిహితులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అయితే చంద్రమోహన్‌ మేనల్లుడు మాత్రం తమ మామయ్య ఆరోగ్యంగానే ఉన్నాడని అంటున్నాడు. మామయ్య ఊపిరితిత్తుల్లో నీరు చేరటంతో ఆసుపత్రిలో చేర్చాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కృష్ణప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రమోహన్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం నేపథ్యంలో ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.