English | Telugu

గుఖ‌శేఖ‌ర్‌పై 420 కేసు

రుద్ర‌మ‌దేవి సినిమాతో గుణ‌శేఖ‌ర్ పీక‌ల్లోతు అప్పుల్లో, ఆర్థిక భారంలో కూరుకుపోయాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ మాట నిజ‌మే అని తేలిపోయింది. రూ.5 లక్ష‌ల చెక్ బౌన్స్ విష‌యంలో ఇప్పుడు ఆయ‌న కోర్టు మెట్లు ఎక్క‌బోతున్నారు. కేసు వేసిందెవ‌రో తెలుసా...??? నటుడు సుమ‌న్. వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం రుద్ర‌మదేవి. ఇందులో సుమ‌న్ ఓ కీల‌క పాత్ర పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన పారితోషికం రూ.5 ల‌క్ష‌లు గుణ‌శేఖ‌ర్ పారితోషికం రూపంలో అందించారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యింది. ఈ విష‌యం గుణ శేఖ‌ర్ దృష్టికి ఎన్నిసార్లు తీస‌కెళ్లినా ఫ‌లితం లేక‌పోయింద‌ట‌. అందుకే సుమ‌న్‌కి ఇక విసుగొచ్చి.. గుణ‌శేఖ‌ర్‌పై నాంప‌ల్లి కోర్టులో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయించాడు. మ‌రి గుణ‌శేఖ‌ర్ ఎలా స్పందింస్తాడో చూడాలి.