English | Telugu
'బన్నీ' హుషారా, జాదూగరా!!
Updated : Jan 19, 2015
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిన గానీ సినిమా టైటిల్ మాత్రం ఇంకా ఖరారుకాలేదు. ఇంతకముందు రెండు, మూడు టైటిళ్లను త్రివిక్రమ్ పరిశీలించగా, అవి బన్నీకి అంతగా నచ్చలేదని సమాచార౦. దీంతో టైటిల్ కోసం అన్వేషణ, ఆలోచన సాగుతున్నాయట. అయితే తాజాగా వినిపిస్తున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మరో రెండు పేర్లు పరిశీలనలో వున్నట్లు సమాచారం. అందులో ఒకటి జాదూగర్ కాగా మరోకటి హుషారు. అయితే వీటిలో కూడా ఏది బెటరనేదానిపై ఆలోచనలు కొనసాగుతున్నాయట. బన్నీకి హుషారు నచ్చగా, త్రివిక్రమ్ మాత్రం జాదూగర్ అన్న టైటిల్ అయితే బెటర్ అని అంటున్నాడట. మొత్తానికి జాదూగర్ అంటే జనాలకు ఎక్కుతుందా, లేక హుషారు అయితే కుదురుతుందా అని చూస్తున్నారట.