English | Telugu

దేవికి పిచ్చి పట్టిందా...ఐటమ్‌ సాంగ్‌ విని షాక్‌ అయిన బన్ని, సుక్కు!

సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ పెట్టడం అనే సంప్రదాయం ఇప్పటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. గతంలో దీన్ని ఐటమ్‌ సాంగ్‌ అనేవారు, ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌ అని కలర్‌ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఐటమ్‌ సాంగ్‌కి సినిమాలో ఒక స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది. అప్పటివరకు సినిమా కథ ఒక ఫ్లోలో సీరియస్‌గా వెళుతున్నప్పుడు ఇటువంటి ఐటమ్‌ సాంగ్స్‌ ఆడియన్స్‌కి కొంత రిలీఫ్‌ని ఇస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే డైరెక్టర్‌ సుకుమార్‌ తన మొదటి సినిమా నుంచి ఐటమ్‌ సాంగ్‌ను వదలడం లేదు. ఎన్టీఆర్‌తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాని మినహాయిస్తే సుకుమార్‌ డైరెక్ట్‌ చేసిన అన్ని సినిమాల్లోనూ ఐటమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. దీనికి సంబంధించి రెండు విశేషాలు ఉన్నాయి. అవేమిటంటే సుకుమార్‌ చేసిన అన్ని సినిమాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాదే. రెండోది ఏమిటంటే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి ఐటమ్‌ సాంగ్‌ సూపర్‌హిట్‌ అయ్యింది. అందుకే సుకుమార్‌, దేవి ఐటమ్‌ సాంగ్‌ విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారు.

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో.. అందులోనిఐటమ్‌ సాంగ్‌ కూడా అంతే పెద్ద హిట్‌ అయ్యింది. ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావ’ అంటూ సాగే ఈ పాటను కంపోజ్‌ చేసిన విధానం, దాన్ని అదే ఊపులో సింగర్‌ ఇంద్రావతి చౌహాన్‌ పాడిన తీరు, ఆ పాటకు స్క్రీన్‌ మీద సమంత పెర్‌ఫార్మెన్స్‌ తోడై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. అయితే ఈ పాట పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే... ‘పుష్ప’ చిత్రం కోసం ఒక ఐటమ్‌ సాంగ్‌ కావాలని దేవిని అడిగాడు సుకుమార్‌. అప్పుడు ‘ఊ అంటావా’ సాంగ్‌ను కంపోజ్‌ చేసి దర్శకనిర్మాతలకు పంపాడు. ఈ సాంగ్‌ని కంపోజ్‌ చేసినపుడే దీన్ని ఖచ్చితంగా దర్శకనిర్మాతలు రిజెక్ట్‌ చేస్తారని భావించాడు దేవి. అందుకే పాటతోపాటు ఒక నోట్‌ కూడా జతచేసి పంపాడు. ‘మీరు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా ఉండే సాంగ్‌ని పంపిస్తున్నాను. ఈ పాట విని నాకు పిచ్చి పట్టింది అనుకోవద్దు. పాటను రిజెక్ట్‌ చెయ్యొద్దు. నన్ను నమ్మి ఈ పాటను సినిమాలో పెట్టండి. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’ అని తన నోట్‌లో వివరించాడట. దేవి చెప్పినట్టుగానే పాట సూపర్‌హిట్‌ అయ్యింది. మొదట ఈ పాట విన్న అల్లు అర్జున్‌, సుకుమార్‌ ఇంత స్లోగా ఉందేమిటి అనుకున్నారట. 30 సెకన్ల తర్వాత పాట ఊపందుకోవడం ఇద్దరికీ పాట నచ్చడం జరిగిపోయింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవి ఊహించిన దానికంటే పెద్ద హిట్‌ అయ్యిందీ సాంగ్‌. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లోనే పుష్ప2 రాబోతోంది. మరి ఈ సినిమాలో ఎలాంటి ఐటమ్‌ సాంగ్‌ పెట్టబోతున్నారో తెలుసుకోవాలంటే పాటలు రిలీజ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.