English | Telugu

డ్రగ్స్‌ కేసులో అందాల సుందరి అరెస్ట్

ఒకప్పుడు తన అందాలతో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన అందాల సుందరి మమతా కులకర్ణి డ్రగ్స్‌ కేసులో అరెస్టయ్యిందట. ఈవార్త ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆమె అరెస్టయ్యింది ఇక్కడ కాదు, కెన్యాలో కాబట్టి. అక్కడ డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు మమతా కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారట. 1997లో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన విక్కీ విజయ్‌ గోస్వామితో మమతా కులకర్ణి చెట్టాపట్టాలేసుకు తిరగడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత సత్ప్రవర్తన కారణంగా విక్కీని గత నవంబర్ 15న విడుదల చేశారు. ఆ తర్వాతే వీళ్లిద్దరూ కలిసి నైరోబీకి వెళ్ళారు. అక్కడ డ్రగ్స్ వ్యాపారం చేస్తుండగా పోలీసులు కలిసి వీరిద్దరినీ అరెస్టు చేసినట్టు సమాచారం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.