English | Telugu
భలే భలే...అక్కడ మార్కెట్ పెంచాడు
Updated : Sep 9, 2015
నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ ఓవర్సీస్ లో రికార్డ్ హిట్ కొట్టి టోటల్ ట్రాక్ రికార్డునే మార్చేసింది. ఈ సినిమా పరిమిత బడ్జెట్ లో తెరకెక్కి అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన తొలి సినిమాగా రికార్డుల కెక్కింది. భలే భలే మగాడివోయ్ హిట్ కొట్టడంతో వచ్చిన పరిణామం. ఇది తెలుగు సినిమాకి మేలు చేసేదే. ఇతరత్రా చిన్నా చితకా సినిమాలకు కూడా ఇప్పుడు విదేశీ మార్కెట్ లో గిరాకీ పెరగడం అంటే ఆ మేరకు నిర్మాతకు మేలు జరుగుతున్నట్టే. మంచి కంటెంట్ వుంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నాని అండ్ మారుతి టీమ్ మరోసారి రుజువు చేశారు.