English | Telugu
వాడి జోలికి ఎవడైనా వస్తే ప్రాణాలు తీస్తా.. మంచు మనోజ్ మాస్!
Updated : Jan 20, 2025
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'భైరవం'. తమిళ మూవీ 'గరుడన్'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకుడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న భైరవం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. (Bhairavam Teaser)
దాదాపు నిమిషంన్నర నిడివితో ఉన్న 'భైరవం' టీజర్.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో పక్కా మాస్ బొమ్మలా ఉంది. ముగ్గురి పాత్రలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. నారా రోహిత్, మంచు మనోజ్ అన్నదమ్ములుగా కనిపిస్తుండగా, వారికి అండగా నిలబడే హనుమంతుడి తరహా పాత్రలో శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. "శీను గాడి కోసం నా ప్రాణాలు ఇస్తా. వాడి జోలికి ఎవడైనా వస్తే ప్రాణాలు తీస్తా" అంటూ మనోజ్ చెప్పే డైలాగ్, "ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోడానికి శీనుగాడు ఉన్నాడు." అంటూ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచాయి. ఇక కాంతారా చిత్రాన్ని గుర్తు చేస్తూ శ్రీనివాస్ షాట్ తో టీజర్ ను ముగించిన తీరు బాగుంది. మరి ఈ ముగ్గురు హీరోలు కలిసి ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'భైరవం'తో బిగ్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాలి.