English | Telugu

కన్నీళ్లు పెట్టుకుంటు కొత్త వాగ్దానం చేసాడు 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ఇప్పుడంటే తన స్థాయికి తగ్గటుగా సినిమాలు తెరకెక్కించటం లేదు గాని,ఒకప్పుడు మాత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా సినిమాలు తెరకెక్కించేవాడు.వర్మ టేకింగ్ కి టెక్నాలజీ కి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యింది.అందుకే వర్మ అక్కడ సుమారు ముప్పై చిత్రాల దాకా దర్శకత్వం వహించాడు.

వర్మ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు .సినిమా చిత్రీకరించడం అంటే బిడ్డకి జన్మనివ్వడంతో సమానం. కొన్ని రోజుల క్రితం నా దర్శకత్వంలో వచ్చిన సత్య మూవీని చూసాను.ఇలాంటి గొప్ప సినిమాని తెరకెక్కించింది నేనేనా అని ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.ఇన్ని రోజులు కథ,కథనాలు లేకుండా అసభ్య కర సినిమాలు తెరకెక్కిస్తు తెలుగు సినిమాకి ఎంత ద్రోహం చేసానో అర్ధమయింది.ముందుకి బానిసనవ్వడంతో పాటు,అహంతో కళ్ళు నెత్తికెక్కి,ఎలాంటి సినిమా తెరకెక్కించినా,ప్రేక్షకులు చూస్తారని భావించి బూతు సినిమాలు తీసాను.ఇక నుంచి మంచి సినిమాలే తెరకెక్కిస్తాను.

ఈ విషయం 27 ఏళ్ళ తర్వాత సత్య సినిమా చూస్తే గాని అర్ధం కాలేదు.సత్య సినిమా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.నా జీవితంలో ఇంకా సగ భాగం మాత్రమే మిగిలివుంది.ఈ సగ భాగంలో మంచి సినిమాలని ప్రేక్షకులకి అందిస్తానని సత్య సినిమా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాని 'ఎక్స్' వేదికగా తెలియచేసాడు.శివ,రంగీలా,క్షణక్షణం,అనగనగాఒక రోజు,అంతం,గోవిందా గోవిందా,రాత్రి,గాయం,దౌడ్,సర్కార్ ,జంగిల్,మస్త్,కంపెనీ,ఆగ్,రక్ష,రక్త చరిత్ర వంటి పలు విభిన్న సినిమాలు వర్మ నుంచి వచ్చాయి

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.