English | Telugu

బెల్లంకొండ కాదు.. అనకొండ‌!

ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి మెలిక వేయాలో బెల్లంకొండ సురేష్‌కి బాగా తెలుసు. ర‌భ‌స త‌ర‌వాత హ‌డావుడిగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ సెట్ చేసేశాడు. అయితే ఆ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. ఎప్పుడు మొద‌ల‌వుతుందో తెలీదు. పెట్టుబ‌డి లేక‌పోవ‌డంతో బెల్లంకొండ ఈ సినిమా ఊసెత్త‌డం లేదు. దాంతో... బోయ‌పాటికీ విసుగొచ్చింది. అర్జెంటుగా బ‌న్నీతో ఓ క‌థ సెట్ చేసి, ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ మొద‌లెట్టేద్దామ‌నుకొన్నాడు. ఈ విష‌యం తెలిసి బెల్లంకొండ గాబ‌రా ప‌డిపోయాడ‌ట‌. వెంట‌నే బోయ‌పాటి ద‌గ్గ‌ర‌కు వెళ్లి...''నా సినిమా పూర్తి చేయ్‌.. ఆ త‌ర‌వాతే మిగిలిన సినిమాలు చూసుకో..'' అన్నాడ‌ట్ట‌. మ‌రి డ‌బ్బుల్లేవు క‌దా అంటే '' ఆ సంగ‌తి నేను చూసుకొంటా. డిసెంబ‌ర్‌లో మ‌న సినిమా ప‌క్కాగా మొద‌లెట్టేద్దాం. ఇది ఖాయం'' అంటూ మాటిచ్చేశాడ‌ట‌. దాంతో బెల్లంకొండ ద‌గ్గ‌ర లాక్ ప‌డిపోయాడు బోయ‌పాటి. తానూ త‌క్కువ వాడు కాదు కాబ‌ట్టి శ్రీ‌నివాస్ సినిమా మొద‌లెట్టినా, లేక‌పోయినా - ఫిబ్ర‌వ‌రిలో బ‌న్నీ సినిమా మొద‌లెట్టేస్తా అని కాస్త గ‌ట్టిగానే చెప్పాడ‌ట‌. దాంతో బెల్లంకొండ ఇప్పుడు పెట్టుబ‌డి పెట్టేందుకు ఎవ‌రు దొరుకుతారా అని కాచుకొని కూర్చున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.