English | Telugu

నందమూరి అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్

‘లెజెండ్‌’ వంటి భారీ సక్సెస్‌ తర్వాత సత్యదేవ్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిల్లో విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 31 అర్థరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సర కానుకగా నందమూరి అభిమానుల కోసం యూట్యూబ్‌లో టీజర్‌ను రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో.. కొత్త సంవత్సర కానుకగా బాలయ్య అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నడమాట..! మరీ న్యూయర్‌ గిఫ్ట్‌ ఎలా ఉండబోతుందనే ఆసక్తితో అభిమానులు వేచి చూస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.