English | Telugu
బాలకృష్ణ లయన్ ఆడియో విశేషాలు
Updated : Apr 9, 2015
నటసింహం నందమూరి బాలయ్య లేటెస్ట్ మూవీ లయన్ 'ఆడియో' మరికాసేపట్లో విడుదలకాబోతుంది. లెజెండ్ వంటి బ్లాక్ బాస్టర్ తరువాత బాలయ్య చేస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది. బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌గా పేర్కొనే..సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల ఆడియోలకు నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో విచ్చేసి ఆడియో రిలీజ్ చేసారు. ఈ రోజు కూడా ఆయన ముఖ్య అతిధిగా రావడం విశేషంగా కనిపిస్తోంది.
అనసూయ, అలీ యాంకర్లుగా స్టేజిపై నవ్వులు పూయించడానికి సిద్దమవుతున్నారు.
ఇప్పటికే నందమూరి అభిమానులు జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ శిల్పకళా వేదికను హోరేతిస్తున్నారు.
మరికాసేపట్లో ఆడియో లైవ్ ప్రారంభం కాబోతుంది.
శిల్పకళా వేదిక వద్ద వున్న బాలయ్య 45 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను అందరిని ఆకట్టుకుంటుంది.
లయన్ ఆడియో లైవ్ ప్రారంభమైంది.
తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆడియోకి అతిధులుగా వచ్చారు.
నందమూరి నటసింహం ఎమ్మెల్యే బాలయ్య ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప గారు 'లయన్' ఆడియో మొదటి పాటను రిలీజ్ చేశారు. ఈ సంధర్బంగా లయన్ టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు.
అందాల ముద్దుగుమ్మ త్రిష ఇప్పుడే ఫంక్షన్ లో మెరిసింది.
రెండో పాటను రేవంత్ రెడ్డి , పరిటాల సునీత కలిసి రిలీజ్ చేశారు.
అన్నగారి ఏవీని నందమూరి బాలకృష్ణ గారు ప్లే చేశారు.
కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లయన్ లోని మూడో పాటను రిలీజ్ చేశారు.
లయన్ ఆడియో సీడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసి మొదటి సీడీని బాలయ్య బాబుకు అందజేశారు.