English | Telugu

అఖిల్‌ టీజర్‌ అదరగొట్టింది

కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని హీరోగా నిఖితారెడ్డి సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో యూత్‌ హీరో నితిన్‌ ఓ యూత్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 8 అఖిల్‌ అక్కినేని పుట్టినరోజును పురస్కరించుకొని విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత నితిన్‌ మాట్లాడుతూ ‘‘అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 8న విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 8వ తేదీ ఉదయం 11 గంటల నుండి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు అంటే 24 గంటల్లో ఈ టీజర్‌కి 3 లక్షల హిట్స్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. వారం రోజుల్లో ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి ఇంకా భారీ రెస్పాన్స్‌ వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. ఇప్పటివరకు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్‌ వచ్చింది. ఈ సినిమాలో ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసే అన్ని అంశాలతో సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు వినాయక్‌గారు.

ఈనెల 22 నుంచి ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లో నెలరోజులపాటు ఒక భారీ షెడ్యూల్‌ను చేయబోతున్నాం. స్పెయిన్‌ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఒక సాంగ్‌ని సెట్‌లో చిత్రీకరించబోతున్నాం. జూన్‌లో 35 రోజులపాటు యుగాండాలో భారీ షెడ్యూల్‌ వుంటుంది.
వెలిగొండ శ్రీనివాస్‌, కోన వెంకట్‌, అనూప్‌ రూబెన్స్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌, అమోల్‌ రాథోడ్‌, ఎ.ఎస్‌.ప్రకాష్‌, రవివర్మ వంటి టాప్‌ టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.