English | Telugu
బాలయ్య 'పవర్' చూపించాడు
Updated : Dec 29, 2014
బాలకృష్ణ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కి సరైన కథ పడితే ఎలా ఉంటుందో,ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో 'లెజెండ్' మరో సారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రం ఇప్పుడు 275 రోజులు పూర్తి చేసుకొంది. ‘లెజెండ్’ సినిమా 275 రోజుల ప్రదర్శన పూర్తవడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. ప్రస్తుతం ఒక హిట్ సినిమా యాభై రోజులాడితే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓ సినిమా వంద రోజులు ప్రదర్శితమవడం అనేది నేటి రోజుల్లో ఓ కల. అలాంటిది ఈ సినిమా 275 రోజులు పూర్తి చేసుకోవడం రికార్డే. కడప జిల్లాలలో సినిమా యూనిట్ 275 రోజుల ఫంక్షన్‌ని జరిపింది. ఈవేడుకలో హీరో బాలకృష్ణ, చిత్ర దర్శకడు బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఘన విజయంతో తన ‘మంగమ్మగారి మనవడు’ ఘన విజయం రోజులు గుర్తుకు వస్తున్నాయని ఇక నుంచి తన అభిమానులు కోరుకునే సినిమాలలో నటిస్తాను అన్నాడు బాలయ్య. ఇక ఈసినిమా దర్శకుడు బాలయ్యను ఆకాశానికి ఎత్తేస్తూ బాలకృష్ణ అంటేనే ‘రాయల్’ అనే పదానికి చిరునామాగా కనిపిస్తాడని మళ్ళీ ఖచ్చితంగా బాలయ్యతో మరో సూపర్ హిట్ చేస్తానని మాట ఇచ్చాడు బోయపాటి.