English | Telugu
బాలయ్యతో మిరపకాయ్ లేడి
Updated : Jun 21, 2013
ఇటీవలకాలంలో పెద్ద హీరోలు నటించే చిత్రంలో మినిమం ఇద్దరు ముగురు హీరోయిన్లుండడం సర్వసాధారణమైపోయింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్స్ ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు వారాల్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో "హీరోయిన్స్" అంటూ పలువురి పేర్లు తెరమీదకొస్తున్నాయి. వాటిలో ఇప్పుడు దీక్షాసేథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మెయిన్ హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసే అవకాశముందనే ఊహాగానాలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అసలే మొదటి హీరోయిన్ ఇంకా కాకుండానే, రెండవ హీరోయిన్, మూడవ హీరోయిన్ అంటూ బాలయ్య సినిమాకు హీరోయిన్స్ ను వెతుకుతున్నారు.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చి ఘన విజయం సాధించిన "సింహా"లో నటించిన నయనతార. ఆ తర్వాత బాపు దర్శకత్వం "శ్రీరామరాజ్యం"లోనూ సీతగా నటించి మన్ననలు పొందింది. ముచ్చటగా మూడోసారి మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ నయనతార నో చెప్తే మొదటి హీరోయిన్ గా టబు లేదా సమీరా రెడ్డి ల పేరు వినిపిస్తున్నాయి. మరి వీరందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ హీరోయిన్స్ ఎవరన్నది త్వరలోనే తెలియనుంది.