English | Telugu

‘డిక్టేటర్‌’లో న్యూలుక్ తో బాలయ్య

బాలకృష్ణ హీరోగా ‘డిక్టేటర్‌’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి శ్రీవాస్‌ దర్శకుడు. మే 29వ తేదీన ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. జూన్‌ 10 నుంచి రెగ్యులర్‌గా సినిమా షూటింగ్‌ జరగనుంది.‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీవాస్‌, బాలకృష్ణతో ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. డిక్టేటర్‌’ సినిమాలో బాలయ్యను డిఫరెంట్‌గా చూపించనున్నాడట శ్రీవాస్‌. ఇప్పటిదాకా బాలయ్యను ఎవరూ చూపించనంత పవర్‌ఫుల్‌గా ‘డిక్టేటర్‌’లో చూపిస్తాడట.ఇందుకోసం బాలయ్య గెటప్ మొత్తం మార్చే పనిలో పడ్డాడట దర్శకుడు శ్రీవాస్. ఇందుకోసం ముంబాయి, మరి కొన్ని చోట్ల మంచి కాస్ట్యూమ్స్ తెప్పిస్తున్నట్లు వినికిడి. బాలయ్య కూడా జిమ్ లో చెమటోడుస్తున్నారట స్లిమ్ కావడం కోసం. ఈరోస్ నిర్మిస్తున్న సినిమాకు మొత్తానికి నిన్న కథ ఫైనల్ అయిందట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.