English | Telugu

బాలకృష్ణ సూపర్‌హీరో లుక్‌ అదిరింది. వివరాల్లోకి వెళితే..!

ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణను యాక్షన్‌ హీరో, ఫ్యాక్షన్‌ హీరో అని పిలిచేవారు. ఇకపై సూపర్‌హీరో అని పిలవాలంటున్నారు నెటిజన్లు. సాధారణంగా సూపర్‌ హీరోల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. చిన్న పిల్లల్ని ఆకట్టుకునే ఓ కల్పిత పాత్ర సూపర్‌హీరో. అలాంటి అసాధారణమైన క్యారెక్టర్లు చేసేందుకు హాలీవుడ్‌ హీరోలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఇప్పుడది టాలీవుడ్‌కి కూడా చేరుకుందని కొన్ని సినిమాల వల్ల తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన హనుమాన్‌ చిత్రంలో మనకు సూపర్‌హీరో కనిపిస్తాడు. అతను చేసే విన్యాసాలు ప్రేక్షకుల్ని విపరీతంగా థ్రిల్‌ చేశాయి. ఇప్పుడు అలాంటి ఓ సూపర్‌ హీరో వేషధారణలో బాలకృష్ణ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బాలకృష్ణ సూపర్‌హీరోగా రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక ఫేక్‌ పిక్‌ అనే విషయం అర్థమవుతుందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దీన్ని కొట్టి పారేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న మరో రెండు విషయాలు ఏమిటంటే.. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌3 త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోలోని స్టిల్‌ అది. రెండోది ప్రశాంత్‌వర్మ.. నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ కూడా నటిస్తున్నారనీ, అది కూడా ఒక సూపర్‌ హీరో క్యారెక్టర్‌ అని చెప్పుకుంటున్నారు. వైరల్‌ అవుతున్న బాలయ్య పిక్‌ వెనుక ప్రచారంలోకి వచ్చిన ఈ రెండు విషయాల్లో ఏది నిజం.. నందమూరి బాలకృష్ణ నిజంగానే సూపర్‌ హీరోగా రాబోతున్నారా అనే విషయం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.