English | Telugu

'డిక్టేటర్' దూసుకోస్తున్నాడు!!

బాలయ్య డిక్టేటర్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చాలా ఫాస్ట్ గా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరిగుతోంది. ఇక్కడ ఓ పబ్ లో ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. సుమారు 20మంది ఫైటర్లు బాలయ్య తలపడుతున్నారు. ఈ ఫైట్ సరికొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. హైదరాబాద్ షడ్యుల్డ్ తర్వాత చిత్ర బృందం ఢిల్లీ వెళ్లనుంది. వారం పాటు కంటిన్యువస్ గా చిత్రీకరించి టాకీ పార్ట్ ను పూర్తి చేస్తారు. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తికాబోతుందట. ఆ తర్వాత డిసెంబర్ చివరి వారంలో పాటల్ని రిలీజ్ చేసి ప్రమోషన్ లో స్పీడ్ పెంచుతారట. మొత్తానికి బాలయ్య సంక్రాంతి రేస్ కి రెడీ వున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.