English | Telugu
ఎన్టీఆర్ సినిమా ఏదో కొత్తగా వుందే!!
Updated : Nov 5, 2015
'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఇప్పటివరకు కేవలం స్టయిలిష్ లుక్ తో పిచ్చెత్తిస్తున్న ఎన్టీఆర్ ను మాత్రమే చూశాం. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒకటి స్టయిలిష్ రోల్ అయితే మరొకటి సైకో మాదిరి ప్రవర్తించే రోల్ అని ఒక రూమర్ ఉంది. అంతే కాదట.. ఈ సినిమా ప్రస్తుత స్టోరీ లండన్ లో జరిగితే.. ఫ్లాష్ బ్యాక్ మాత్రం మాస్ బ్యాక్ డ్రాప్ లో ఇండియాలో ఉంటుందట. ఎన్టీఆర్ కు అది రెగ్యులర్ ఎలిమెంటే అయినా.. ఇలాంటి స్టయిలిష్ ఫిలింలో ఫ్యాక్షన్ అంటే మాత్రం ఏదో కొత్తగానే ఉంది. యంగ్ టైగర్ అనేసరికి సుక్కూ కూడా మ..మ..మ్మాస్ అంటున్నాడు.