English | Telugu

డిక్టేట‌ర్ గుండెల్లో గుబులు

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి గానీ.. ప్ర‌తీ సినిమాకీ ఏదో ఓ స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది. తాజాగా డిక్టేట‌ర్‌కి థియేట‌ర్ల స‌మ‌స్య ఎదురైంది. అదీ ఇక్క‌డ కాదు.. అమెరికాలో. అక్క‌డ ఈ సినిమాని భారీ ఎత్తున విడుద‌ల చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. అందుకు స‌ర్వం సిద్ధం చేసుకొన్నారు. అయితే.. ఇప్పుడు డిక్టేట‌ర్‌కి త‌గిన‌న్ని థియేట‌ర్లు దొర‌క‌డం లేదు.

నాన్న‌కు ప్రేమ‌తో, ఎక్స్‌ప్రెస్ రాజా ఆల్రెడీ అమెరికా థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించుకొన్నాయ‌ట‌. రెండు నెల‌ల ముందే ఎక్స్‌ప్రెస్ రాజా థియేట‌ర్ల‌న్నీ బుక్క‌యిపోయాయ‌ని టాక్‌. నాన్న‌కు ప్రేమ‌తో కూడా కాస్త అడ్వాన్సుగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు డిక్టేట‌ర్‌కి అక్క‌డ థియేట‌ర్లు దొరక‌డం లేదు. దాంతో ఈసినిమాని అమెరికాలో కాస్త ఆల‌స్యంగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న‌కు వ‌చ్చింద‌ట చిత్ర‌బృందం.

అమెరికాలో లేటుగా విడుద‌లైతే.. ప్ర‌మాదం. ముందే రిజ‌ల్ట్ తెలిసిపోతే.. ప్ర‌వాసాంధ్రులు సినిమా చూడరు. అందుకే.. దొరికిన థియేట‌ర్ల‌తో స‌రిపెట్టుకొందామా అని ఆలోచిస్తున్నారు. క‌నీసం 70 థియేట‌ర్లు దొరికినా సినిమా వేసేద్దామ‌నుకొంటున్నార్ట. సాధార‌ణం బాల‌య్య సినిమాలు అక్క‌డ దాదాపు 150 థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది. అయితే ఇప్పుడు 50 థియేట‌ర్లు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఎదురైంద‌ట‌. మ‌రి.. ఈ క‌ష్టాల నుంచి డిక్టేట‌ర్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.