English | Telugu

బాలచందర్ అంతిమయాత్ర ప్రారంభం

ప్రముఖ దర్శకుడు బాలచందర్ అంతిమయాత్ర చెన్నైలో ప్రారంభం అయ్యింది. కాసేపట్లో బీసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.బాలచందర్ ను కడసారి దర్శించుకునే అవకాశాన్ని కమల్ కోల్పోయారు. ఉత్తమ విలన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కమల్ లాస్ ఏంజిల్స్‌కు వెళ్లారు. బాలచందర్ మరణ వార్త విన్న కమల్ అమెరికా నుండి బయలుదేరారని కమల్ మేనేజర్ తెలిపారు. ఈ రాత్రికి కమల్ చెన్నై చేరుకునే అవకాశముంది. బాలచందర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నంతో ముగియనున్నాయి. దాంతో కమల్ హాసన్ తన గురువును కడసారి దర్శించుకునే అవకాశాన్ని కోల్పోయారు.