English | Telugu

అఖండ 2 లో సల్మాన్ ఖాన్ కాపాడిన మున్నీ

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అఖండ 2'(Akhanda 2)షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. బాలయ్య పద్మభూషణ్(Padmabhushan)అందుకున్న తర్వాత వస్తున్న మూవీ 'అఖండ 2 'నే కావడంతో చిత్ర యూనిట్ ప్రతి విషయంలోను ఎంతో జాగ్రతగా తీసుకొని తెరకెక్కిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ తో అయితే బాలయ్య మరోసారి రికార్డుల వేటకి సిద్ధమవుతున్నాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.

ఇప్పుడు ఈ మూవీలో 'జనని' అనే క్యారక్టర్ లో బాలీవుడ్ యువనటి 'హర్షాలీ మల్హోత్రా'(harshaali Malhotra)ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మేరకు నిన్న మేకర్స్ అధికారకంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఇందుకు సంబంధించిన 'హర్షాలీ' పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ కాంబోలో 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'భజరంగీ భాయీజాన్'. ఈ మూవీలో 'మున్ని' అనే క్యారక్టర్ లో పాకిస్థాన్ కి చెందిన బేబీ గా కనిపించింది. అప్పుడు హర్షాలీ వయసు ఏడూ సంవత్సరాలు. చిన్న వయసు అయినా ఆ క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ఎంతో మంది ప్రసంశలు అందుకుంది. బెస్ట్ ఫీమేల్ డెబ్యూ గా ఫిలిం ఫేర్ కి కూడా నామినేట్ అయ్యింది. దీంతో అఖండ 2 లో హర్షాలీ చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు ఏ క్యారక్టర్ లో చేయబోతుందనే ఆసక్తి ఏర్పడింది. భజరంగీ భాయీజాన్ తర్వాత హర్షాలీ చేస్తున్న రెండో మూవీ అఖండ 2 నే కావడం విశేషం.

ఇక అఖండ 2 విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. సంయుక్త మీనన్(Samyuktha Menon)అది పినిశెట్టి లు కీలక పాత్రలు పోషిస్తుండగా బాలకృష చిన్న కూతురు తేజశ్వని తో కలిసి రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటికే సింహా, లెజండ్, అఖండ వచ్చి ఎంతగా ఘన విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.