Read more!

English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ జూన్ లో రిలీజ్

అల్లు అర్జున్ "బద్రీనాథ్" జూన్ లో రిలీజ్ అవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, వివివినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రానికి యమ్ యమ్ కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. ఈ "బద్రీనాథ్" చిత్రం నిజానికి మే 22 వ తేదీన విడుదల కావలసి ఉండగా, ఫెడరేషన్ సమ్మె వలన "బద్రీనాథ్" చిత్రం రిలీజ్ ఆలస్యం అనివార్యం అవనుంది. "బద్రీనాథ్" సినిమాకి సంబంధించి ఇంకా మూడు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. ఆమూడు పాటల షూటింగ్ "మే" నెలలో పూర్తి చేసి, మే నెల చివరి వారంలో "బద్రీనాథ్" చిత్రం ఆడియోని రిలీజ్ చేసి, జూన్ తొలి వారంలో కానీ లేదా రెండవ వారంలో కానీ "బద్రీనాథ్" చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్ల కోసం అల్లు అర్జున్ ఫైట్ మాస్టర్ పీటర్ హేయిన్స్ తో కలసి థాయ్ ల్యాండ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అయితే ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తుంటే చివరికి ఆ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయటం ఆఖరికి అల్లు అరవింద్ వంటి నిర్మాతవల్ల కూడా కావటం లేదంటే మన తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.