English | Telugu

ప్రెస్ తో ఇంటర్వ్యూ అంత వీజీకాదు అజార్ గారూ..!

ప్రెస్ తో ఇంటర్వ్యూ అంటే క్రికెట్ షాట్ కొట్టినంత ఈజీ కాదని అజారుద్దీన్ కు అర్ధమై ఉంటుంది. మీట్ ద ప్రెస్ లో ఏం చెప్పాలనుకుంటే అది చెప్పి వెళ్లిపోవడం సింపులే. కానీ వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మాత్రం, ప్రెస్ వాళ్లు అడిగే క్వశ్చన్స్ కు సిద్ధమై ఉండాలి. పూర్తి సిద్ధంగా ఉన్నా, ఎక్కడో ఒకచోట లంపటం పెడతారు. విషయంలోకి వెళ్తే, ఇమ్రాన్ హష్మి హీరోగా అజారుద్దీన్ జీవిత చరిత్రతో అజార్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం జోరుగా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అజారుద్దీన్. కానీ వివాదాస్పదమైన తన జీవిత కథను సినిమాగా తీస్తున్నప్పుడు, ఇంటర్వ్యూలో కూడా దానికి సంబంధించిన ప్రశ్నలుంటాయని అజార్ మర్చిపోయినట్టున్నాడు. ఒక ఇంటర్వ్యూలో అతని మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం గురించి కాస్త లోతైన ప్రశ్నలు అడిగారట. అంతే జవాబు చెప్పకుండా ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయాడట. ఆ తర్వాతి ఇంటర్వ్యూలను కూడా చేయనని చెప్పేశాడట. ఆ క్వశ్చన్స్ ఇంక అడగమని వాళ్లు చెబుతున్నా, ఇచ్చే ప్రసక్తి లేదని ఖచ్చితంగా స్పష్టం చేసేశాడని సమాచారం. దీంతో ప్రెస్ ఇంటరాక్షన్ అంటే ఎంత కష్టమో అజార్ కు అర్ధమై ఉంటుందని మీడియా జనాలు అనుకుంటున్నారు. ఈ సంఘటన అజార్ కు ఇబ్బందే అయినా, సినిమా ప్రమోషన్ కు మాత్రం ఇది కూడా ప్లస్సే..కాదంటారా..?

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.