English | Telugu

రేవతి 'ఇట్లు అమ్మ‌'కు అవార్డుల వెల్లువ‌! ఓటీటీ వీక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌!!

'అంకురం' ఫేమ్ సి. ఉమామహేశ్వరావు దర్శకత్వంలో సుప్రసిద్ధ నటి రేవతి ప్ర‌ధాన పాత్ర‌పోషించిన ఇట్లు అమ్మ చిత్రానికి అసాధార‌ణ స్పంద‌న ల‌భిస్తోంది. బొమ్మ‌కు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. బొమ్మకు మురళి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించారు. సోని లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా బాగా ఆద‌రిస్తున్నారు. అవార్డులు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఈ విష‌యాన్ని నిర్మాత డా. బొమ్మకు మురళి తెలియ‌జేస్తూ, "రేవతి గారి నటన, ఉమామహేశ్వరావు దర్శకత్వ ప్రతిభ, మధు అంబట్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సన్నీ ఎమ్. ఆర్ సంగీతం, గోరటి వెంకన్న గానం-సాహిత్యం, సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రఫీ తదితర అంశాలు 'ఇట్లు అమ్మ' చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి. సోని లివ్ లో ప్రసారమవుతున్న ఈ మూవీని ఓటిటి ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. అన్నారు.

Also read:4 గంట‌లు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డ్డ‌ వ‌నిత‌.. ఎందుకో తెలుసా?

ఇప్ప‌టిదాకా త‌మ చిత్రానికి 47 అవార్డులు వరించాయని అమితానందంతో ముర‌ళి చెప్పారు. "మరిన్ని అవార్డులు వస్తాయనే నమ్మకముంది. ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇంత గొప్ప చిత్రం మా బొమ్మకు క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణం కావడం మాకెంతో గర్వకారణం. రేవతి గారు 'ఇట్లు అమ్మ' చిత్రం తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పడం బట్టి ఈ చిత్రం ఎంత గొప్ప‌గా వ‌చ్చిందో అంచనా వేయవచ్చు. ఈ చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా మా అంచనాలను మించి వస్తున్నాయి" అన్నారాయ‌న‌. Also read:అక్క‌డ నేనొక‌దాన్ని ఉన్నాన‌నే ధ్యాస‌లేకుండా తార‌క్‌, చ‌ర‌ణ్ తెగ క‌బుర్లు చెప్పుకునేవారు!

పోసాని కృష్ణమురళి, రవి కాలె, ప్రశాంత్, మిహిర, వినీత్, అరువి బాల ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎమ్.ఆర్, సాహిత్యం: గోరేటి వెంకన్న-ఇండస్ మార్టిన్, గానం: గోరటి వెంకన్న, మంగ్లీ, రోల్ రైడా, రాము, నృత్యాలు: సుచిత్ర చంద్రబోస్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: మధు అంబట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కనకదుర్గ, నిర్మాత: డా. బొమ్మకు మురళి, దర్శకత్వం: సి. ఉమామహేశ్వరరావు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.