English | Telugu

'శ్యామ్‌ సింగరాయ్‌'తో నాని ప్రభంజనం.. శాటిలైట్ రైట్స్ కి అన్ని కోట్లా!

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్‌ సింగరాయ్‌'. ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నాని గత చిత్రాలు 'వి', 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదలై నిరాశపరిచినప్పటికీ రికార్డు స్థాయిలో 'శ్యామ్‌ సింగరాయ్‌' ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

Also Read:వరంగల్ లో 'శ్యామ్‌ సింగరాయ్‌' రాయల్ ఈవెంట్!

ఇప్పటికే 'శ్యామ్‌ సింగరాయ్‌' హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఓ ప్రముఖ సంస్థ రూ.10 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా మంచి అమౌంట్ కి అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ టీవీ ఛానల్ 'శ్యామ్‌ సింగరాయ్‌' తెలుగు శాటిలైట్ రైట్స్ ను రూ.10 కోట్లకు దక్కించుకుంది. నాని సినిమాకి శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.10 కోట్లు రావడం మంచి డీల్ అనే చెప్పొచ్చు.

Also Read:తారక్, చరణ్ వల్ల టైం వేస్ట్ అయింది!

నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత రెండు చిత్రాలతో నిరాశపరిచిన నాని.. 'శ్యామ్‌ సింగరాయ్'తో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. డిసెంబర్ 24 న విడుదల కావాల్సిన 'గని' కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో క్రిస్మస్ కి సోలోగా అలరించడానికి నానిని ఛాన్స్ దొరికింది. ఈ సినిమాతో నాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read:'గని' విడుదల వాయిదా.. నానికి కలిసొచ్చింది!

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

బాలీవుడ్ లో 90 శాతం పెళ్లిళ్లు ఫేక్.. పూర్తి  డీటెయిల్స్ వివరించిన అగ్ర నటుడు  

భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఉన్న ప్రాముఖ్యత తెలిసిందే. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే నానుడి కూడా అనాదిగా వస్తుంది. కానీ బాలీవుడ్ చిత్ర సీమకి ఇవేమి పట్టవని,అక్కడ జరిగే పెళ్లిళ్లు  తొంబై శాతం ఫేక్ అని ప్రముఖ బాలీవుడ్  నటుడు ప్రతీక్ స్మిత పాటిల్(Prateik smitaPatil)సంచలన కామెంట్స్ చేసాడు. ప్రతీక్ ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని ప్రీవియస్ మూవీ  హిట్ 3 లో విలన్ గా అద్భుతమైన పెర్ ఫార్మ్ చేసి గూగుల్ లో  తన డీటెయిల్స్ సెర్చ్ చేసే అవసరాన్ని తెలుగు ప్రేక్షకులకి కూడా కల్పించాడు. మరి పెళ్లిళ్లపై ఏమంటున్నాడో చూద్దాం.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.