English | Telugu
ఆటోనగర్ సూర్య ప్లాటినమ్ ఫంక్షన్
Updated : Jun 19, 2014
దేవకట్ట దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆటోనగర్ సూర్య ఎన్నో ఒడిదుడుకుల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం రేపు సెన్సార్ కు వెళుతున్నట్టు సమాచారం. ముచ్చటగా మూడోసారి నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా హ్యాట్రిక్ హిట్ సాధిస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక 25న చేస్తున్నట్లు సమాచారం.