English | Telugu

అమ్మా.. బ్ర‌హ్మీని ఎంత‌మాట‌న్నాడు??

నిన్న కాక మొన్న ఫేస్ బుక్‌లో ర‌వితేజ‌పై, మెగా ఫ్యాన్స్‌పై హాట్ హాట్ కామెంట్లు చేసి అడ్డంగా దొరికిపోయాడు ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి. ఆ త‌ర‌వాత అయ్యో. నేనేం అన‌లేదే.. నా ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది అని క‌వ‌ర్ చేసుకొన్నాడు. ఇప్పుడు ఏకంగా బ్ర‌హ్మానందంపై ప‌డ్డాడు. ఆయ‌న్నా టార్గెట్ చేసుకొని కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పిల్లా నువ్వు లేని జీవితం ఇటీవ‌లే విడుద‌లైంది. మీ సినిమాలో బ్ర‌హ్మానందం లేకుండా కూడా కామెడీ పండించారు క‌దా.. అని అడిగితే - కామెడీ పండాలంటే బ్ర‌హ్మానంద‌మే అవ‌స‌రం లేదు, ఆయ‌న లేక‌పోయినా వినోదం పండుతుంది... క‌థ‌లో ద‌మ్ముంటే చాలు అంటున్నాడు. అంతేకాదు.. బ్ర‌హ్మానందాన్ని వాడుకొని సినిమా నడిపించ‌లేన‌ని, త‌న సినిమాలో బ్రహ్మానందం చేసే కామెడీకి స్కోప్‌లేద‌ని సెల‌విచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. బ్ర‌హ్మానందం కామెడీ అడ్డుపెట్టుకొని కొన్ని సినిమాలు ఆడేశాయ‌ని త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశాడు. మొత్తానికి ఓ యావ‌రేజ్ సినిమా చేతికి రాగానే.. ఈ ద‌ర్శ‌కుడికి కాస్త కాన్పిడెన్స్ డోస్ ఎక్కువైన‌ట్టుంది. మ‌రి ఈ జోరు ఎంత కాల‌మో...??

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.