Read more!

English | Telugu

‘ఛాన్స్‌ ఇచ్చాను.. మరి నాకేమిస్తావ్‌’ అని అడిగిన స్టార్‌హీరో.. అర్చన ఏం చేసిందో తెలుసా?

గత కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి రకరకాల అప్‌డేట్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. దానివల్ల బాధింపబడిన వారు ఒక్కొక్కరుగా తమ అనుభవాన్ని అందరితో షేర్‌ చేసుకుంటున్నారు. మీటు అంటూ ధైర్యంగా కొందరి వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామనే విషయాలను చెబుతున్నారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇప్పటిది కాదు. సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచే ఉంది. అయితే అప్పట్లో మీడియా అంతగా విస్తరించి లేకపోవడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకపోవడం వల్ల అన్ని విషయాలూ వెలుగులోకి వచ్చేవి కాదు. ఇప్పుడు అలా కాదు. మీడియా బాగా పెరిగింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా అన్ని సమస్యల గురించి చర్చించేందుకు పెద్ద వేదికగా మారింది. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైనవారు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చి తమకు ఎదురైన సమస్యల గురించి చెప్పారు. 

ఇప్పుడు కొత్తగా నటి అర్చన గురించి ఈ తరహా మాట వినిపిస్తోంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం ఆమెతో జరిపిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఈ విషయాన్ని ఎప్పుడో ప్రస్తావించిందన్న విషయం ఇప్పుడు వీడియో చూస్తున్నవారికి తెలుస్తోంది. తన సినిమాలో మంచి అవకాశం ఇచ్చాము కదా.. మరి నాకేమిస్తావు అని ఒక స్టార్‌ హీరో అడిగారని తెలిసింది అని అడిగిన ప్రశ్నకు.. అర్చన కొంతసేపు తటపటాయించి ‘అవును’ అని అంగీకరించింది. ఆ హీరో అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో తెలీక కొంత సేపు మౌనంగా ఉన్న తర్వాత ‘మీకు ఇచ్చేంత దానిని కాదు సార్‌ నేను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిందట. అంత పెద్ద మనిషి అలా అడగడం తనకు ఎంతో ఫన్నీగా అనిపించిందని చెబుతుంది అర్చన. అప్పటికే తను చిన్నదాన్నని, ఆ వయసులో అలా చెప్పేంత ధైర్యం ఎలా వచ్చిందో తనకే తెలియదు అంటోంది. 

నిజానికి అతను అడిగింది చాలా పెద్ద విషయమని, దానికి తను సీరియస్‌ అవ్వడం వల్ల తనకే నష్టం అని గ్రహించానని, అందుకే తెలివిగా తప్పించుకున్నానని చెప్పింది. ఈ ఇన్సిడెంట్‌ జరిగిన తర్వాత ఆ సినిమాలో తను చేసిన చాలా సీన్స్‌ని కట్‌ చేసేశారని చెప్పింది అర్చన. అలా కట్‌ చేసినందుకు తను బాధ పడలేదని, అతను అడిగింది తను ఎలాగూ చెయ్యలేనని, కాబట్టే అతను చెయ్యాల్సింది చేశాడని నవ్వుతూ చెప్పింది అర్చన. ఆ తర్వాత ఆ హీరో కాంపౌండ్‌ నుంచి తనకు అవకాశాలు రావని తెలుసునని, అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది.