English | Telugu

బాలయ్యతో సాంగేసుకున్న తెలుగమ్మాయి

పాండురంగడు, పరమవీర చక్ర సినిమాల తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది తెలుగ‌మ్మాయి అర్చన. బాలయ్య నటిస్తున్న లయన్ మూవీలో ఈ ముద్దుగుమ్మ ఓ ప్రముఖ పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. అలాగే బాలయ్య తో ఓ సాంగ్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ పాట సినిమాకి హైలైట్ నిలుస్తోందని ఫిలింనగర్ టాక్. అర్చ‌న కూడా ఈ సినిమాపై భారీ ఆశ‌లు పెంచుకొంది. ఈ పాట‌తో త‌న కెరీర్ మ‌లుపు తిర‌గ‌డం ఖాయ‌మ‌ని న‌మ్ముతోంది. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో. ఈ పాట క్లిక్ల‌యితే.. తెలుగు చిత్ర‌సీమ‌కు మ‌రో ఐటెమ్ భామ దొరికేసిన‌ట్టే.