English | Telugu
14 భాషల్లో రిలీజ్ కానున్న ‘కథనార్’.. షాక్ ఇచ్చిన అనుష్క!
Updated : Sep 1, 2023
అనుష్క శెట్టి తన అందంతోపాటు అందర్నీ కట్టి పడేసే చక్కని అభినయంతో హీరోయిన్‌గా ఒక స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అమె కెరీర్‌లో అరుంధతి, భాగమతి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌గా అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక ‘బాహుబలి’ సిరీస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ‘సైజ్ జీరో’ చిత్రంతో అందర్నీ నిరాశపరచిన అనుష్క ఇప్పుడు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో రాబోతోంది. అంతేకాదు, మరో పాన్ ఇండియా మూవీకి సంబంధించిన అప్‌డేట్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ‘కథనార్’(ది వైల్డ్ సోర్సెరర్) పేరుతో మలయాళంలో రూపొందిన చిత్రం తాలూకు గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. జాతీయ అవార్డు అందుకున్న జయసూర్య ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్బంగా ఈ అప్‌డేట్‌ను అందించారు. రెండు భాగాలుగా ఈ సినిమా కడమత్తత్తు కథనార్ ఆధారంగా రూపొందుతోంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఫాంటసీ హారర్ మూవీగా తెరకెక్కుతున్న ‘కథనార్’(ది వైల్డ్ సోర్సెరర్)కి సంబంధించిన గ్లింప్స్ అద్భుతమైన విజువల్స్‌తో ఉంది. ఈ చిత్రాన్ని 14 భాషల్లో రిలీజ్ చెయ్యబోతున్నారు. అనుష్క కెరీర్‌లో ‘కథనార్’ మరో మైల్‌స్టోన్ మూవీ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.