English | Telugu

పవన్ మంచి మనిషి - అంజలి లావణ్య

"పవన్ మంచి మనిషి" అని అంజలి లావణ్య అంటూందట.ఇంతకీ ఈ అంజలీ లావణ్య ఎవరు...? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈమెకు సంబంధం ఏమిటి...? ఇవేగా మీ అనుమానాలు. కింగ్ ఫిషర్ 2011 క్యాలెండర్‍ లో స్థానం సంపాదించుకుందీ 27 యేళ్ళ వయసున్న అంజలీ లావణ్య. అంతే కాదు మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలసి టైటాన్ యాడ్ లోనూ, మహీంద్ర గ్జైలో కార్ల యాడ్ లోనూ, పాంటలూన్స్ యాడ్ లోనూ ఈ అంజలీ లావణ్య మనకు కనపడుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ తో అంజలీ లావణ్యకున్న సంబంధం అంటారా... పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా, విష్ణువర్థన్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న "ది షాడో" చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఆమె అడవిశేషు సరసన నటిస్తూంది. పవన్ కళ్యాణ్ గురించి అలాంటి అంజలీ లావణ్య మాట్లాడుతూ "పవన్ చాలా జంటిల్ మేన్. ఆయనతో కలసి "ది షాడో" సినిమాలో నటించటం చాలా ఆనందంగా ఉంది" అని అంటూంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.