English | Telugu

ఆ సినిమా వంశీ పైడిపల్లి వల్లవుతుందా...?

ఆ సినిమా వంశీ పైడిపల్లి వల్లవుతుందా...? ఇదేం ప్రశ్నయ్యా...? ఆ సినిమా ఏంటో చెప్పకుండా వంశీ పైడిపల్లి వల్లవుతుందా...? అంటే ఏమిటర్థం....? విషయమేమిటంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా, గీతా ఆర్ట్స్ పతాకంపై, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ "చరణ్-అర్జున్" అనే ఒక భారీ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకి ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో ఏ దర్శకుడైతే న్యాయం చేయగలుగుతాడనే చర్చ ఫిలిం నగర్ లో భారీ ఎత్తున జరుగుతూంది.

రాజమౌళి - ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఆయన రికార్డులేంటో అందరికీ తెలిసిందే. ఉదాహరణకు "సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర" వంటి చిత్రాలు రాజమౌళి మేధస్సు ఏమిటో మనకు తెలియచెపుతాయి. రాజమౌళి ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడు.

వి.వి.వినాయక్ - కమర్షియల్ సినిమాను ఎలా తీయాలో బాగా తెలిసిన యువ డైనమిక్ దర్శకుడు. ఆది, దిల్, ఠాగూర్, లక్ష్మి, బన్నీ, అదుర్స్ వంటి చిత్రాలు ఆయనెలాంటి దర్శకుడో చెపుతాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా నటించే సినిమాకు వినాయక్ కచ్చితంగా న్యాయం చేస్తాడు.

బోయపాటి - "భద్ర", "తులసి", "సింహా" చిత్రాలతో హేట్రిక్ కొట్టిన యువ దర్శకుడు బోయపాటి. రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా నటించే "చరణ్ - అర్జున్" సినిమాకు బోయపాటి కూడా న్యాయం చేయగలడు.

సురేంద్ర రెడ్డి - ఇతను కూడా "అతనొక్కడే", "అశోక్", "కిక్" వంటి మంచి హిట్ సినిమాలనిచ్చాడు. ఇలా ఇంతమంది దమ్మున్న యువ దర్శకులుండగా వంశీ పైడిపల్లికి ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం లభించటం నిజంగా గొప్పే కదా...మరి వంశీ పైడిపల్లి ఈ సినిమాని హ్యాండిల్‍ చేయగలడంటారా...? దీని మీద మీ అభిప్రాయమేంటి...?

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.