English | Telugu

'విశాల్ 35' కోసం రంగంలోకి అంజలి!

అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారు. వరుస సక్సెస్‌లతో ఉన్న విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. చివరగా ‘మద గజ రాజా’ అంటూ అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతోంది. విశాల్ 35 ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో అంజలి కీలక పాత్రను పోషించబోతోన్నారు. ఈ మేరకు విశాల్ 35 ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారన్నట్టుగా టీం ప్రకటించింది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. నటి దుషార విజయన్ విశాల్ సరసన కథానాయికగా నటించనున్నారు.

ఈ కొత్త చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ముఖ్యంగా ‘మద గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో జతకట్టడం విశేషం.

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.