English | Telugu

బాహుబ‌లిని బన్నీ ఏమన్నాడంటే..

అంద‌రి నోటా బాహుబ‌లి మాటే. బాహుబ‌లి తెలుగు సినిమా గ‌ర్వం... అంటూ అంద‌రూ రాజ‌మౌళి అండ్ టీమ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే మాట చెబుతున్నాడు. బాహుబ‌లికి విషెష్ చెబుతూ బ‌న్నీ సోష‌ల్ మీడియాలో స్పందించాడు. బాహుబ‌లిలాంటి సినిమా తెలుగువారంద‌రికీ గ‌ర్వ కార‌ణ‌మ‌ని, ఇంత భారీ చిత్రం తెలుగు నుంచి రావ‌డం..ఆనందంగా ఉంద‌ని చెప్పాడు.

ప్ర‌భాస్‌, రానా, రాజ‌మౌళిల‌పై ప్ర‌సంశ‌లు కురిపించాడు. ఈసినిమాతో ప్ర‌భాస్‌, రానాలు త‌మ కెరీర్‌లో ఉన్న‌త స్థాయికి ఎదుగుతార‌న్న న‌మ్మ‌కం ఉందన్నాడు బ‌న్నీ. ఇటీవ‌లే చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు కూడా బాహుబ‌లికి ఇలాంటి కితాబులే ఇచ్చారు. ఇప్పుడు బ‌న్నీ కూడా తోడ‌య్యాడు. ఇలా హీరోలంతా నెత్తిన పెట్టుకొంటే.. అంద‌రి అభిమానులూ బాహుబ‌లిని ఆశీర్వ‌దిస్తే.. తెలుగు సినిమా చ‌రిత్ర క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.