Akhanda 2: తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్ లో బాలయ్య తాండవం
నందమూరి అందగాడు, బాక్స్ ఆఫీస్ బొనాంజా, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna)చేసే శివ తాండవంతో థియేటర్స్ ఊగిపోవడానికి సర్వం సిద్దమయ్యింది. ఈ రోజు నైట్ తొమ్మిది గంటల నుంచే బెనిఫిట్ షోస్ ప్రదర్శిస్తుండటంతో అభిమానుల్లో అయితే పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఆన్ లైన్ లో బెనిఫిట్ షోస్ టికెట్స్ ని ఉంచడం ఆలస్యం బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.