English | Telugu

తిరుపతికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి

తిరుపతికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి బయలుదేరారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.మార్చి ఆరవ తేదీన అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ ఫంక్షన్ అత్యంత వైభవంగా హైటెక్స్ లో జరిగింది. అనంతరం మార్చి ఎనిమిదవ తేదీన అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రేసెప్షన్ కూడా వేలాదిమంది మెగా అభిమానుల సమక్షంలో మొన్న సోమవారం ఘనంగా జరిగింది.


అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ అయ్యాక కొత్త దంపతులు కనుక తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారం కోసం, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం తిరుపతికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి బయలుదేరారట. తిరుపతికి బయలుదేరిన అల్లు అర్జున్, స్నేహారెడ్డిలతో పాటు వెంట పెద్దలెవరెవరు వెళ్ళారో ఇంకా తెలియరాలేదు.


తిరుపతికి బయలుదేరిన అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆశీస్సులు లభించాలనీ, ఆ కొత్తదంపతులు కలకాలం పిల్లపాపలతో చల్లగా ఉండాలనీ, వారి కాపురం పచ్చగా కళకళాలాడాలని తెలుగు వన్ ఆశీర్వదిస్తోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం