English | Telugu

స‌రైనోడు... స‌రిగా లేదు


సినిమా విడుద‌ల వ‌ర‌కూ ఎన్నయినా మార్పులూ, చేర్పులూ చేసుకోవొచ్చు. ఒక్క‌సారి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. మ‌న చేతుల్లో ఏం ఉండ‌దు. అందుకే రీషూట్ల‌కు కూడా సినిమా వాళ్లు రెడీ అయిపోతున్నారు. రీషూట్ల వ‌ర‌కూ వెళ్ల‌డం ఎందుకు... అదేదో స్ర్కిప్టు ద‌శ‌లోనే స‌రిచూసుకోవ‌చ్చుగా.. అనిపించింది అల్లు అర‌వింద్ కి. అందుకే... స‌రైనోడు స్ర్కిప్టుని ద‌గ్గ‌ర పెట్టుకొని దిద్దుతున్నాడ‌ట‌. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ విష‌యంలో అల్లుఅర‌వింద్ మ‌రీ ప‌ట్టుగా ఉన్నాడ‌ట‌.

బోయ‌పాటి రాసిన క్లైమాక్స్ అర‌వింద్‌కి నచ్చ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ క్లైమాక్స్ కొత్త‌గా రాయించాడ‌ని టాక్‌. అంతేకాదు.. సినిమా అంతా ఓసారి చూసుకొని కొన్ని మార్పులు సూచించిన‌ట్టు టాక్‌. అయితే.. అర‌వింద్ మితిమీరిన జోక్యం.. బోయ‌పాటికి బొత్తిగా న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. కక్క‌లేక మింగ‌లేక అన్న‌ట్టుందంట ఆయ‌న ప‌రిస్థితి. ఏదో.. ఈ సినిమాకి ఇలా కానిచ్చేద్దాం అని స‌ర్దుకుపోతున్నాడ‌ని తెలుస్తోంది. అర‌వింద్‌ది బ‌లే బుర్ర‌.. ఆయ‌న ఏం చేసినా అందులో మీనింగుంటుంది. ఈ సినిమా హిట్ట‌యితే... ఆ క్రెడిట్ అంతా బోయ‌పాటిదే క‌దా. అందుకే ఈ మాత్రం స‌ర్దుబాట్లు త‌ప్ప‌వు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.