English | Telugu
స్టైలిష్ స్టార్ మాలీవుడ్ ఎంట్రీ
Updated : Jun 21, 2014
అల్లు అర్జున్ మల్లూస్ రాష్ట్రం కేరళలో చాలా పాపులర్. అక్కడి సూపర్స్టార్లతో సమానంగా అల్లు అర్జున్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తెలుగులో వచ్చిన బన్నీ ప్రతీ చిత్రం మలయాళంలోనూ విడుదలవుతుంది. ఈ చిత్ర విడుదలకు బన్నీ అభిమానులు తెగ హడావిడి కూడా చేస్తుంటారు. వీరి అభిమానం చూసిన బన్నీ స్ట్రెయిట్ మల్లు సినిమాలో నటిస్తానని మాట కూడా ఇచ్చాడు. బన్నీ కూడా ఆసక్తి కనబరచడంతో అక్కడి దర్శకులు కథలతో వచ్చి కలవడం, మలయాళ చిత్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుందని సమాచారం. బన్నీ వద్దకు వచ్చిన కథలలో ఒకటి ఓకే చేసే అవకాశం కూడా వుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలు ప్రకటిస్తారంటున్నాయి సినీవర్గాలు. తెలుగులో అల్లు అర్జున్ మల్లుగా మలయాళ తెర మీద కనిపించే సమయం త్వరలోనే రానుందన్నమాట.