English | Telugu

బ‌న్నీ ప‌వ‌న్‌ని కాపీ కొట్టాడా?

త్రివిక్ర‌మ్ ఇంకా అత్తారింటికి దారేది హ్యాంగోవ‌ర్‌లోనే ఉన్న‌ట్టున్నాడు. ఆ సినిమా నుంచి తాను ఇప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్నాడేమో అనిపిస్తోంది. లేటెస్టుగా విడుద‌లైన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి టీజ‌ర్ చూస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. 20 సెక‌న్ల‌పాటు సాగిన ఈ టీజ‌ర్‌ని చూస్తే అత్తారింటికి దారేది గుర్తురాక‌మాన‌దు. వీడు ఆర‌డుగుల బుల్లెట్టు.... ధైర్యం విసిరిన రాకెట్టూ.. అంటూ అత్తారింటికి దారేది తొలి టీజ‌ర్ విడుద‌లైంది. ఆ లొకేష‌న్లు, ఫ్రేమూ, బ‌న్నీ గెట‌ప్ ఇవ‌న్నీ చూస్తే.. అత్తారింటికి దారేదిలో బ‌న్నీని చూసిన‌ట్టే అనిపిస్తోంది. దానికి తోడు.. ఇది కూడా ఫ్యామిలీస్టోరీనే. ఓ సంప‌న్నుడు... త‌న ఆస్తినంత‌టికీ కోల్పోయి.. ఏమీ లేనివాడిలా బ‌త‌క‌డం అన్న‌ది కాన్సెప్టు. అత్తారింటికి దారేది కూడా అంతే క‌దా..??? మల్టీమిలీయ‌నీర్ ఓ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ఆ త‌ర‌హా లైన్‌నే మ‌ళ్లీ ఎంచుకొన్నాడు త్రివిక్ర‌మ్‌. అత‌డు, జ‌ల్సా, ఖ‌లేజా చూస్తే యాక్ష‌న్ అంశాల‌కూ ప్రాధాన్యం ఉంటుంది. కానీ అత్తారింటికి దారేదిలో ఆ మోతాదు బాగా త‌గ్గించాడు త్రివిక్ర‌మ్‌. సేమ్ టూ సేఫ్ స‌త్య‌మూర్తిలోనూ యాక్ష‌న్ పాళ్లు త‌క్కువేన‌ట‌. మొత్తానికి అత్తారింటికి దారేది ఫార్మెట్‌లోనే.. త్రివిక్ర‌మ్ న‌డిస్తే.. ఇంచుమించుగా ప‌వ‌న్ పాత్ర‌లోకి దూరిపోవ‌డానికి బ‌న్నీ కూడా తాప‌త్ర‌యం ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. అస‌లు విష‌యం తెలియాలంటే ఏప్రిల్ 2న సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ... ఆగాల్సిందే.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.