English | Telugu

అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రదానం

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఎఫ్.ఎన్.సి.సి.లో ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నవరత్నాలు పేరుతో వివిధ రంగాల్లో విశేషసేవలు అందించిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు... కుమార్తె నాగ సుశీల, మనవళ్ళు సుమంత్, సుశాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అలనాటి నిర్మాత కృష్ణవేణి, నటి జమున, విద్యావేత్త రామయ్య, వ్యాపారవేత్త ఏవీఆర్ చౌదరి, రంగస్థల నటుడు కర్నాటి లక్ష్మీ నరసయ్య, వైద్యుడు డాక్టర్ గుల్లా ప్రకాష్, సమాజ సేవకుడు డాక్టర్ సునీత కృష్ణన్, చేనేత కళాకారుడు నల్లా విజయ్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణా మలావత్‌లకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను అందజేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.