English | Telugu

ఐరెన్ లెగ్స్ @ 2015

ఐరెన్ లెగ్‌,... ఈ మాట చెబితే సినీ జ‌నాలు ఝ‌డుసుకొంటారు. అస‌లే సినిమా వాళ్ల‌కు సెంటిమెంట్లు జ‌ర జాస్తి. దానికి విరుద్ధంగా ఒక్క అడుగు కూడా వేయ‌లేరు. అందులోనూ ఐరెన్ లెగ్గంటే... ప్లెగ్గులో వేలు పెట్టినంత భ‌యం. ఫ‌లానా క‌థానాయిక న‌టిస్తున్న సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్స్ అవుతున్నాయంటే ఐరెన్ లెగ్ ముద్ర వేసేస్తారు. మ‌రోసారి ఆ ఆక‌థానాయిక‌ని ఎంచుకోవాలంటే ఒక‌టికి ల‌క్ష‌సార్లు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి. అప్ప‌టి వ‌ర‌కూ ఫుల్‌ఫామ్ లో హిట్లు కొట్టిన హీరోయిన్లు సైతం స‌డ‌న్ గా ఐరెన్ లెగ్గులు అయిపోతుంటారు. అలా 2015 కొంత‌మంది హీరోయిన్ల‌ను ఐరెన్ లెగ్గులుగా మార్చింది.

ర‌కుల్ దారి తప్పింది..!

గ‌తేడాది ర‌కుల్ ప్రీత్ సింగ్ ని చూస్తే హిట్టు దేవ‌త న‌డిచొచ్చిన‌ట్టే క‌నిపించేది. ఇప్పుడామె పేరు చెబితేనే జ‌నాలు జ‌డుసుకొంటున్నారు. కార‌ణం.. వ‌రుస ఫ్లాపులు చుట్టుముట్టుకోవ‌డ‌మే. ర‌కుల్ న‌టించిన పండ‌గ చేస్కో, కిక్ 2, బ్రూస్లీ విడుద‌ల‌య్యాయి. పండ‌గ చేస్కో ఓ మాదిరిగా ఆడితే... మిగిలిన రెండూ అట్ట‌ర్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో ర‌కుల్‌పై ఐరెన్ లెగ్ ముద్ర ప‌డిపోయింది.



ఫ్లాప్ ఖన్నా..!

రాశీ ఖ‌న్నా ప‌రిస్థితీ అంతే. ఈ అమ్మ‌డి నుంచి జిల్, శివ‌మ్‌, బెంగాల్ టైగ‌ర్ సినిమాలొచ్చాయి. జిల్ బిలో యావ‌రేజ్ స్థాయిలో నిలిచింది. శివ‌మ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ గామిగిలిపోయింది. ఇక బెంగాల్ టైగ‌ర్ అంతంత‌మాత్రంగానే ఆడింది.

అనుష్క జీరో అయ్యింది..!!

ఇక అనుష్క కూడా ఈ యేడాది మ‌ర్చిపోదు. కార‌ణం.. బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో వ‌చ్చాయి. అందులో బాహుబ‌లిలో రెండు మూడు సీన్ల‌కంటే ఎక్కువ అనుష్క క‌నిపించ‌లేదు. రుద్ర‌మ‌దేవి కోసం ఎంత క‌ష్ట‌ప‌డినా ఆమెకు ప్ర‌తిఫ‌లం ద‌క్క‌లేదు. ఇక సైజ్ జీరో భారీ ఫ్లాపుల లిస్టులో చేరిపోయింది. ఒక విధంగా అనుష్క‌కీ ఇది బ్యాడ్ ఇయ‌రే.

త‌మ‌న్ కొత్తగా ఏం చేస్తాడు!!!

సంగీత దర్శ‌కుల జాబితాకొస్తే త‌మ‌న్ కూడా ఐరెన్ లెగ్గ‌యిపోయాడు. ఆయ‌న సంగీతం అందించిన కిక్ 2, షేర్‌, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

కోన వెంక‌ట్ కు కష్టాలు షూరూ..!!

ర‌చ‌యిత‌లోనూ ఓ ఐరెన్ లెగ్గ్ ఉన్నాడు. ఆయ‌నే కోన వెంక‌ట్‌. ఆయ‌న స్ర్కిప్టు అందించిన సినిమాల‌న్నీ ఈ యేడాది ఫ‌ట్టే. నిర్మాత‌గా మారి తీసిన శంకరాభ‌ర‌ణం డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. ఈ ఐరెన్ లెగ్గ‌ల జాత‌కం 2016లో అయినా మారుతుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.