English | Telugu

అఖిల్ కి 'స్టార్లు' క‌నిపించ‌లేదా??

తెలుగు చిత్ర‌సీమ నిండా స్టార్లే. మ‌హేష్, ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ... ఇలా ప్ర‌తి ఇంటి నుంచి ఇద్ద‌రు ముగ్గురు స్టార్లున్నారు. కొత్త‌గా అడుగుపెడుతున్న ఏ క‌థానాయ‌కుడైనా స‌రే వీళ్ల నుంచి స్ఫూర్తి పొందాలి. వీళ్ల‌నే పోటీగా తీసుకోవాలి. అయితే అఖిల్ ఏమంటున్నాడో తెలుసా..?? 'చిత్ర‌సీమ‌లో మీకు పోటీ ఎవ‌రు?' అనే ప్ర‌శ్న‌కు 'మోక్ష‌జ్ఞ‌' అంటూ వెరైటీ సమాధానం చెప్పి అంద‌రికీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

మోక్ష‌జ్ఞ కాబోయే హీరో. ఆ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మోక్ష‌జ్ఞ ఎలా ఉంటాడో, ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఇప్పుడే ఊహించ‌లేం. కనీసం శాంపిల్ చూద్దామ‌న్నా మోక్ష‌జ్ఞ బాల‌న‌టుడిగా సినిమాలేం చేయ‌లేదు. అంటే.. క‌నీసం మోక్ష‌జ్ఞ టాలెంట్ ఏంటో అంచ‌నా వేయ‌కుండా.. 'నాకు పోటీ మోక్ష‌జ్ఞే' అంటే అర్థం ఏమిటి?? ఇప్పుడున్న హీరోలెవ్వ‌రూ త‌న‌కు పోటీ కాద‌నే క‌దా? మ‌హేష్‌, ప‌వ‌న్‌, ఎన్టీఆర్ ఇలాంటి ఉద్దండులంటే లెక్క‌లేద‌నే క‌దా?? 'ఇప్పుడున్న హీరోలెవ‌రూ నాకు పోటీ కాదు.. రాబోతున్న హీరోలే నాకు పోటీ' అని అఖిల్ భావించ‌డం... సినీ వ‌ర్గాల్ని విస్మ‌య‌ప‌రుస్తోంది.

'ఇక్క‌డ ఎవ‌రికీ ఎవ‌రూ పోటీ కాద'నో, లేదంటే 'నాకు నేనే పోటీ' అనో ఏదో క్యాలిక్లేటెడ్ స‌మాధానాలు చెప్పుకోవాలి కానీ, ఇలా కాంప్లికేటెడ్ మ్యాట‌ర్‌లో త‌ల‌దూర్చ‌కూడ‌ద‌న్న విష‌యం అఖిల్‌కి ఇంకా అర్థం కాలేదు. అఖిల్ ఆన్స‌ర్ త‌న‌కంటూ కొన్ని క్యాలిక్లేష‌న్లు ఉన్నాయి. 'మోక్ష‌జ్ఞ‌' పేరు చెబితే.. నంద‌మూరి అభిమానుల స‌పోర్ట్ త‌న‌కు ల‌భిస్తుంద‌న్న‌ది అఖిల్‌లో ఉన్న ప్రొడ్యూస‌ర్ బ్రెయిన్ కి త‌ట్టిన ఆలోచ‌న కావొచ్చు. కానీ ఇలాంటి త‌ల‌తిక్క స‌మాధానాల వ‌ల్ల మిగిలిన హీరోల ఫ్యాన్స్ హ‌ర్ట‌వుతార‌న్న విష‌యం గుర్తించుకోవాలి. లేదంటే.. అఖిల్‌కి తిప్ప‌లు త‌ప్ప‌వు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .