English | Telugu
అఖిల్ పరిస్థితి.. అగమ్యగోచరమేనా??
Updated : Nov 18, 2015
అఖిల్ తొలి సినిమా కోసం పెద్ద ఎత్తున చర్చ సాగింది. దర్శకుడెవరు, ఎలాంటి కథతో వస్తాడు? అనే విషయాలపై టాలీవుడ్ ఆసక్తిగా చర్చించుకొంది. ఆ సినిమా వచ్చింది, వెళ్లిపోయింది కూడా. ఇప్పుడు రెండో సినిమాకీ అదే పరిస్థితి. తొలి సినిమా ఫ్లాప్ అవ్వడంతో... కనీసం రెండో సినిమా అయినా హిట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓ స్టార్ దర్శకుడ్ని పట్టుకొని బండి లాగించేయాలన్నది నాగ్ ఆలోచన.
అయితే.. అఖిల్ తో సినిమా చేయడానికి ఏ దర్శకుడూ సిద్ధంగా లేడు. త్రివిక్రమ్ ఇప్పడు `అ ఆ`తో బిజీ. పూరి చేతిలోనూ వరుసగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీనువైట్లతో సినిమా చేసే ధైర్యం నాగార్జునకూ, అఖిల్‌కీ లేకపోవచ్చు. క్రిష్, శేఖర్ కమ్ములలపై మరీ క్లాస్ ఓపీనియన్ ఉంది. మాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ వెంటనే క్లాస్ కథకి ఎడ్జస్ట్‌కాకపోవచ్చు. రాజమౌళితో సినిమా అంటే... అది ఇప్పట్లో సాధ్యం కాదు. అంటే.. దాదాపుగా టాప్ మోస్ట్ దర్శకులంతా అఖిల్‌కి దూరంగానే ఉన్నారన్నమాట.
ఈ దశలో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే.. రిస్క్ అఖిల్ చేయడు కూడా. సో.. ఇప్పడు అఖిల్‌కి ఓ దర్శకుడు కావాలి. అయితే పూరితో, లేదంటో శ్రీనువైట్లతో మహా కాదంటే క్రిష్‌లాంటి దర్శకుడితో ఎడ్జస్ట్ అయిపోవాలి. మరి అఖిల్ ఏం చేస్తాడో?