English | Telugu

సుబ్రమణ్యంతో ఆదాశర్మ

హార్ట్‌ అటాక్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ముంబయి భామ ఆదా శర్మ. ఆ సినిమాతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసి.. ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. త్రివిక్రమ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ కూడా ఆమెకు ఛాన్స్‌ ఇచ్చాడు. ఇంకా ఒకటి రెండు సినిమాలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంతలో మరో మంచి ఛాన్స్‌ కొట్టేసింది ఆదా. ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో సక్సెస్‌ఫుల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’లో ఆదా ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తోంది.ఐతే ఇది గెస్ట్‌ రోల్‌ కాదని.. ఆమె సెకండ్‌ హీరోయిన్‌ కూడా కాదని అంటున్నాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ”నా విజ్ఞప్తిని మన్నించి మా సినిమాలో చేసేందుకు ఒప్పుకున్న ఆదా శర్మకు చాలా థ్యాంక్స్‌. ఐతే ఆమెది గెస్ట్‌ రోల్‌ కాదు. ఆదా రెండో హీరోయిన్‌ కూడా కాదు. ఆమెది చాలా స్పెషల్‌ క్యారెక్టర్‌” అని ట్వీట్‌ చేశాడు హరీష్‌. దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా కథానాయిక. ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాపవడంతో ఏడాదికి పైగా ఖాళీగా ఉండిపోయిన హరీష్‌.. ఈ సినిమాతో మళ్లీ తనేంటో ప్రూవ్‌ చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.