English | Telugu

టాలీవుడ్ పై తాప్సీ కామెంట్స్.. గ్లామర్ మాత్రమే అడుగుతున్నారు

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సొట్టబుగ్గల సుందరి తాప్సీకి ఛాన్స్ ల మీద ఛాన్స్ లు వస్తున్నాయంట. ఇది ఎవరో చెబుతున్నమాట కాదు స్వయంగా తాప్సీనే చెప్పుకుంటోంది. తాను చెయ్యాలనుకుంటే తెలుగులో, తమిళంలో ఛాన్స్ లు వెంటబడుతున్నాయని.. అంతేకాదు బాలీవుడ్ లో అయితే ఏకంగా తన కోసం రెడ్ కార్పెట్ ఏ వేస్తారని కాస్త ఎక్కువగానే చెప్పుకుంటుంది. కానీ తానే కావాలని అవకాశాలు వదులుకుంటున్నాని చెప్పింది. అంతేకాదండోయ్ ఎందుకు వదులుకుంటున్నానో కూడా వివరణ ఇచ్చింది ఈ అమ్మడు.

గంగ సినిమా రెండు బాషాల్లోనూ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా తరువాత తనకు అదే తరహాలో ఉన్న పాత్రకు సంబంధించి తమిళంలో చాలా అవకాశాలు వచ్చాయంట కాని ఏం ఒప్పుకోలేదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో అయితే చెప్పనవసరం లేదు కేవలం గ్లామ్ డాల్ గా మాత్రమే.. రోటిన క్యారెక్టర్లు వస్తున్నాయి అందుకే ఒప్పుకోవడం లేదు అని చెబుతుంది. అయితే ఆఖరిలో తెలుగు ఇండస్ట్రీ గురించి ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఒక రకంగా చూస్తే తెలుగు కంటే తమిళంలోనే చాలా బెటర్.. కొంచం ఛాలెంజింగ్ రోల్స్ వస్తున్నాయి అని అంది. అంటే అమ్మడి మాటలను బట్టి చూస్తే తెలుగులో కేవలం గ్లామర్ మాత్రమే అడుగుతున్నారని చెప్పకనే చెప్పింది కదా..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.