English | Telugu

వెనక్కి తగ్గేదేలే.. కేసుని వదిలేదేలే!

ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌.కె.నాయుడుపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీసుధ న్యాయ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు ముగిసిపోలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని తేల్చి చెప్పింది.

శ్యామ్ పెళ్లి పేరిట ఐదేళ్ల పాటు సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని సుధ అప్పట్లో హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా శ్యామ్ కు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సుధ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్యామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతడి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సుధ పిటిషన్ ను కొట్టివేసి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఈ విషయంపై సుధ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. "బెయిల్‌ మాత్రమే లభించింది. కేసు ఇంకా బతికే ఉంది. నేను కూడా నువ్వు చేసిన అన్యాయంపై పోరాడటానికి బతికే ఉన్నాను. మున్ముందు ఎదురయ్యే సెషన్స్‌ ను ఎదుర్కొవడానికి రెడీగా ఉండు" అంటూ సుధ పోస్ట్‌ చేసింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.