English | Telugu

తాగి గొడ‌వ చేసిన అంజలి

వెండితెరపై ప‌ద్ధ‌తైన పిల్ల‌గా కనిపించే అంజలి బయట ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్ గా అంజలి బంజారాహిల్స్ లోని లిక్విడ్ పబ్ లో ఫుల్ గా తాగి ఆమె చేసిన హంగామాకి అందరూ ఆశ్చర్యపోయారట. తన స్నేహితుడితో కలిసి నైట్ పబ్ కి వచ్చిన అంజలి మద్యం తాగిన తరువాత డాన్స్ ఫ్లోరుకి వెళ్ళే సమయంలో ఒక యువకుడు అడ్డుతగలడంతో అంజలి విపరీతమైన హంగామా చేసిందట. ఆ యువకుడితో పాటు పబ్ నిర్వహకుల మీద తిట్ల దండకం మొదలుపెట్టిందట. ఆమె మాటలను చూసి అక్కడివారందరూ ఆశ్చర్యపోయరాట. ఆమె ఎంత వరకూ శాంతించకపోవటంతో సహనం కోల్పోయిన పబ్ వారు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి అంజలిని ఇంటికి పంపిచ్చినట్లు సమాచారం. పైకి క‌నిపించ‌దు గానీ.. అంజలిలో ఇంత మేట‌రుందా..??

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...